శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 జూన్ 2023 (08:55 IST)

కూతురిని హీరోయిన్ చేయాలనుకుంది.. ఏం చేసిందో తెలుసా?

కూతురిని హీరోయిన్ చేయాలనుకుంది. బిడ్డ త్వరగా పెద్దకావాలని ఆ తల్లి ఆమెకు సూది మందులు ఇప్పించింది. అయితే ఇంజెక్షన్లు వికటించడంతో బాలిక అనారోగ్యం పాలైంది. తల్లి వేధింపులు తాళలేక బాలిక పోలీసులను ఆశ్రయించింది. 
 
ఏపీలోని విజయనగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో ఉండే ఓ మహిళకు(40) 15 ఏళ్ల కూతురు ఉంది. మహిళ భర్త ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రెండో పెళ్లి కూడా చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. విశాఖలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న పెద్ద కూతురు వేసవి సెలవుల కోసం తల్లి వద్దకు వచ్చింది. తల్లి ప్రవర్తన ఆమెకు నచ్చలేదు. 
 
ఇటీవల మహిళ ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి బాలికను చూసి ఆమెకు హీరోయిన్ అయ్యే లక్షణాలు ఉన్నాయని చెప్పాడు. అతని మాటలు విన్న మహిళ బాలిక అందంగా మారేందుకు ఏవేవో సూదులు ఇప్పించింది. కానీ, సూది మందులు వికటించడంతో బాలిక అనారోగ్యం పాలైంది. 
 
తల్లికి ఇదంతా తనకు నచ్చలేదని చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఇక లాభం లేదని పోలీసులను ఆశ్రయించింది.