శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 31 మే 2023 (21:25 IST)

డాబా నిద్రించిన పాపానికి కూతురిని 25సార్లు కత్తితో పొడిచాడు..

knife
చిన్నచిన్న విషయాలకే ఆవేశానికి గురై హత్యలు చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. కోపాన్ని, ఆగ్రహాన్ని నిగ్రహించుకోలేక కొంతమంది నేరాలకు పాల్పడుతున్నారు. 
 
తాజాగా టెర్రేస్‌పై నిద్రించిందనే కోపంతో కూతురిని ఓ తండ్రి 25 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. సూరత్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
రామానుజ అనే వ్యక్తి సత్యనగర్‌లో అద్దెకు వుంటున్నాడు. ఇతని మాట వినకుండా.. మే 18 రాత్రి ఇంట్లో గొడవ జరిగింది. ఆడవాళ్లంతా డాబాపై పడుకున్నారు. దీంతో అతను తన భార్యచో వాగ్వాదానికి దిగాడు. 
 
ఈ క్రమంలో కూతురిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.