గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 4 జులై 2017 (14:50 IST)

బీర్ హెల్త్ డ్రింకా..? అమ్మాయిలను కూడా తాగమంటారా? ఎర్రచందనాన్ని అమ్మే హెరిటేజ్‌ను?: రోజా

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సర్కారుపై వైకాపా ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎర్రచందనాన్ని అమ్మే హెరిటేజ్‌ను అభివృద్ధి చేశారా? అంటూ ప్రశ్నించారు. హెరిటేజ్ వ్యానులో ఎర్రచందనం దుంగలు వెళ్తున్నా

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సర్కారుపై వైకాపా ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎర్రచందనాన్ని అమ్మే హెరిటేజ్‌ను అభివృద్ధి చేశారా? అంటూ ప్రశ్నించారు. హెరిటేజ్ వ్యానులో ఎర్రచందనం దుంగలు వెళ్తున్నాయి రోజా ధ్వజమెత్తారు. నారావారిపల్లెలో ఉన్న చంద్రబాబు పొలంలో కూడా ఎర్రచందనం దుంగలు దొరికాయని విమర్శించారు. 
 
ఇక బీర్‌ను హెల్త్ డ్రింక్ అంటూ ఏపీ మంత్రి జవహర్ చేసిన వ్యాఖ్యలను రోజా తప్పుబట్టారు. బీర్ హెల్త్ డ్రింక్ అంటూ మంత్రులు కామెంట్లు చేస్తుంటే.. ప్రభుత్వం ఇక రానున్న రోజుల్లో విద్యార్థులతో బీర్ తాగించేలా ఉన్నారని మండిపడ్డారు. అంతేగాకుండా అమ్మాయిలను కూడా మందు తాగమంటారా అంటూ ప్రశ్నించారు. స్కూళ్లు, గుళ్ల మధ్య వైన్ షాపులను వైసీపీ అంగీకరించదని తెలిపారు. మంత్రి జవహర్ తక్షణం ప్రజలకు క్షమాపణలు చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. 
 
ఇదిలా ఉంటే.. ఏపీ ఎక్స్‌జ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బీరును హెల్త్ పానీయం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఏపీ నూతన మద్యం పాలసీని ప్రవేశపెడుతూ.. బీరును సంప్రదాయ హెల్త్ డ్రింక్ అనేలా ప్రచారం చేస్తామన్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీరులో ఆల్కహాల్ వుంటుందని.. బీరు వల్ల బెల్లీ ఫాట్ పెరుగుతుంది, షుగర్ లెవల్స్ పెరుగుతాయని.. అలాంటప్పుడు అదెలా హెల్త్ డ్రింక్ అవుతుందని నెటిజన్లు సైతం జవహర్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.