శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 3 మార్చి 2022 (16:07 IST)

ఊ అంటావా రెడ్డి.. ఊహూ అంటావా రెడ్డి అంటూ సీఎం జగన్ పైన రఘురామ సెటైర్లు

ఊ అంటావా రెడ్డి.. ఊహూ అంటావా రెడ్డి. కోర్టు తీర్పుకు ఊ అంటావా.. ఊహూ అంటావా జగన్ రెడ్డి. రైతులు పోరాడుతున్న గుడారాలను తొలగించి వారి పనులు వారు చేసుకోవాలి. అమరావతిని అభివృద్థి చేయాలి అంటూ సెటైర్లు వేసారు వైసిపి రెబల్ ఎంపి రఘురామ కృష్ణరాజు. 

 
ఇక ఊహూ అనడానికి ప్రభుత్వానికి అవకాశం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూడంటే మూడు అన్నారు. బొత్స సత్యనారాయణ కూడా మాట్లాడారు. చాలామంది బుడంకాయలు మాట్లాడారు. ఏం మాట్లాడినా.. ఎంత పెర్ఫార్మెన్స్ చేసినా ఉపయోగం లేదు.

 
అమరావతి దీపం వెలుగుతో మీ అహం దీపం ఆరిపోయింది. మీరు జ్యోతిని ఎంత ఊదినా అది ఆగిపోదు. అలాగే ఉంటుంది. ఇప్పటికైనా మీరు మారండి.. మీలో మార్పు రావాలి. లేకుంటే మీరు బాగా ఇబ్బంది పడతారు.

 
అమరావతిని అభివృద్థి చేయడం ఇక నుంచి ప్రారంభించండి. రైతులు చేసిన పోరాటాలు చాలు. ఇన్ని రోజులు వారు చేసిన పోరాటాలు పట్టించుకోలేదు. మూడు రాజధానులంటూ ఏవేవో మాట్లాడారు. ఇప్పుడేమంటారంటూ ఎంపి రఘురామ క్రిష్ణమరాజు సూటిగా ప్రశ్నించారు.