శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 4 నవంబరు 2019 (22:44 IST)

మీరు అలా చెప్పడం తప్పు.. జగన్‌కు ముద్రగడ లేఖ

ముఖ్యమంత్రి జగన్‌కు కాపు నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.

ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక పాలసీ విషయంలో నిర్లక్ష్యం తగదని పేర్కొన్నారు. నదుల్లో ప్రవాహం ఉన్న కారణంగా ఇబ్బంది ఎదురవుతోందని చెప్పడం తప్పు అన్నారు. నదుల్లో ఎప్పుడు నీళ్లు ఉంటాయో.. ఎప్పుడు ప్రవాహం తక్కువగా ఉంటుందో జనానికి తెలుసన్నారు.

ప్రభుత్వంలో అభద్రతాభావం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. హామీలు ఇవ్వకున్నా కొత్త పథకాలు అమలు చేసేందుకు తాపత్రయపడుతున్నారని అన్నారు. కాపులకు రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం పట్టించుకోకపోవడం తమ దురదృష్టంగా చెప్పుకొచ్చారు.