బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : బుధవారం, 10 జనవరి 2018 (21:22 IST)

శ్రీవారి ఆలయ మాడావీధిలో మద్యాన్ని సేవించిన యువకుడు

తిరుమల శ్రీవారి ఆలయం ఎంత పవిత్రమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు వేలాదిమంది భక్తులు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళుతుంటారు.

తిరుమల శ్రీవారి ఆలయం ఎంత పవిత్రమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు వేలాదిమంది భక్తులు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళుతుంటారు. ఆధ్మాత్మిక క్షేత్రమే కాదు పవిత్రమైన ప్రాంతం. తిరుమల గిరులు మొత్తం ఎంతో విశిష్టత కలిగినది అయితే మాడా వీధులు మరెంతో విశిష్టమైనది. అలాంటి ఆలయ పరిసర ప్రాంతాల్లోనే ఒక యువకుడు మద్యం సేవించాడు. తాపీగా మాడా వీధుల్లో కూర్చొని సంగటి ఆరగిస్తూ మద్యం సేవించాడు. 
 
మీడియా అక్కడకు చేరుకోగా మీకు ఇష్టమొచ్చిన వారికి చెప్పుకోండంటూ క్వార్టర్ బాటిల్‌ను పైకెత్తి కింద దించకుండా గడాగడా తాగేశాడు. పచ్చిగా మద్యాన్ని తాగడమే కాదు ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో గొడవకు దిగాడు. దీంతో మీడియా ప్రతినిధులు తితిదే విజిలెన్స్‌కు సమాచారమివ్వగా నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.