గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2017 (10:52 IST)

యువకుడు మంటల్లో కాలిపోతుంటే.. వీడియో షూట్

చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండే ప్రతి ఒక్కరూ సెల్ఫీలు, వీడియోలు తీసేందుకు అమితాసక్తిని చూపిస్తున్నారు. ముఖ్యంగా, తమ కళ్ల ఎదుట ఏం జరుగుతుందనే విషయాన్ని విస్మరించి సెల్ఫీల కోసమే ఎగబడుతున్నారు.

చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండే ప్రతి ఒక్కరూ సెల్ఫీలు, వీడియోలు తీసేందుకు అమితాసక్తిని చూపిస్తున్నారు. ముఖ్యంగా, తమ కళ్ల ఎదుట ఏం జరుగుతుందనే విషయాన్ని విస్మరించి సెల్ఫీల కోసమే ఎగబడుతున్నారు. 
 
తాజాగా ఢిల్లీలోని సాకుర్‌ బస్తీ రైల్వే స్టేషన్‌ ఆవరణలో ఓ దారుణం జరిగింది. ఓ యువకుడు మంటల్లో కాలిపోతుంటే దాన్ని తమ సెల్‌ఫోన్‌లో షూట్ చేసేందుకు స్థానికులు అమితాసక్తిని చూపారు. ఫలితంగా అందరూ చూస్తుండగానే రక్షించాలని కేకలు వేస్తూ నిలువునా కాలిపోయాడు. 
 
మృతుడు 20 యేళ్ల వయసు కలిగిన సిక్కు యువకుడిగా గుర్తించారు. అతను ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెపుతున్నారు. ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అతన్ని రక్షించేందుకు ఎవరూ ప్రయత్నించక పోవడంతో ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. కాగా, ఆత్మహత్యకు ముందు గంటసేపు స్టేషన్‌ ఆవరణలోనే తచ్చాడాడని స్థానికులు చెపుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.