గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 24 నవంబరు 2017 (19:49 IST)

బావిలో దూకేసిన నలుగురు ఇంటర్ ఫస్టియర్ అమ్మాయిలు

ఈమధ్య కాలంలో అమ్మాయిల ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి. చిన్నచిన్న విషయాలకే ప్రాణాలను తీసేసుకుంటున్నారు. ఇటీవల చెన్నైలోని సత్యభామ యూనివర్శిటీలో కళాశాలలో కాపీ కొడుతుండగా ఉపాధ్యాయుడు తిట్టారని, ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తాజాగా తమిళనాడులోని వేలూరులో

ఈమధ్య కాలంలో అమ్మాయిల ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి. చిన్నచిన్న విషయాలకే ప్రాణాలను తీసేసుకుంటున్నారు. ఇటీవల చెన్నైలోని సత్యభామ యూనివర్శిటీలో కళాశాలలో కాపీ కొడుతుండగా ఉపాధ్యాయుడు తిట్టారని, ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తాజాగా తమిళనాడులోని వేలూరులో నలుగురు విద్యార్థునులు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 
 
స్థానిక ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో 11వ త‌ర‌గ‌తి చ‌దువుతోన్న విద్యార్థినులు మూకుమ్మడిగా నలుగురూ కలిసి ఆత్మహత్య చేసుకోవడంపై కలకలం రేగింది. కాగా ఉపాధ్యాయులు మంద‌లించ‌డం వ‌ల్లే వారి ఆత్మహత్య చేసుకుని వుంటారని చెప్పుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.