Daily Horoscope
✕

వివేకా హత్య కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డిని అరెస్టు చేశాం.. రిలీజ్ చేశాం

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 9 జూన్ 2023 (11:14 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప వైకాపా సిట్టింగ్ ఎంపీ వైఎస్. అవినాశ్ రెడ్డిని ఈ నెల మూడో తేదీన అరెస్టు చేశామని సీబీఐ తెలిపింది. ఆ తర్వాత ఆయనకు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన్ను వెంటనే విడుదల చెసినట్టు చెప్పారు. ఈ నెల మూడో తేదీన విచారణ కోసం కార్యాలయానికి వచ్చినపుడు అవినాశ్‌ను సీబీఐ అరెస్టు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత రూ.5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు తీసుకుని వెంటనే ఆయనను విడిచిపెట్టింది. 
 
తెలంగాణ హైకోర్టు గత నెల 31వ తేదీన అవినాశ్ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆయనను అరెస్టుచేయాల్సి వస్తే పూచీకత్తులు తీసుకుని వెంటనే విడుదల చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలో గత శనివారం ఆయన విచారణ కోసం కార్యాలయానికి వచ్చినపుడు సాంకేతికంగా అరెస్టు చేసి పూచీకత్తులు తీసుకుని విడుదల చేసింది. ఈ విషయం బయటపడకుండా సీబీఐ.. అవినాశ్ రెడ్డి వర్గాలు జాగ్రత్త వహించాయి. 

అన్నీ చూడండి

హాలీవుడ్ సినిమాకు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం?

Upasana : క్లిన్ కారా పాప ను అప్పుడే స్కూల్ లో జాయిన్ చేసిన రామ్ చరణ్, ఉపాసన.

యథార్థ ఘటనల ఆధారంగా కూల్ రాఖీ కూల్ చిత్రం పోస్టర్స్, టైటిల్ లాంచ్

Priyanka Jain : శివ విజయం కోసం ప్రత్యేక ప్రార్థన, శ్రీవారిని దర్శించుకున్న ప్రియాంక జైన్

Action King Arjun: శ్రీరామ జ‌న్మ‌భూమి అయోధ్య‌లో యాక్షన్ కింగ్ అర్జున్ చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు

తర్వాతి కథనం
Show comments