శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 మార్చి 2023 (12:10 IST)

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. వైకాపా అభ్యర్థులదే విజయం

ysrcp flag
ఏపీలో జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపును నమోదు చేసుకున్నారు. ఎన్నికలు జరిగిన 4 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. పీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మెుదలైంది. 
 
ఇందులో భాగంగా కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ విజయం సాధించారు. మొత్తం 1,178 ఓట్లు వుండగా, 1,136 పోల్ అయ్యాయి. ఇందులో 53 చెల్లనివి. ఇందులో 53 చెల్లని ఓట్లు గుర్తించిన ఎన్నికల కౌంటింగ్ అధికారులు.. మిగిలిన 1,083 ఓట్లకు లెక్కింపు నిర్వహించారు. ఇందులో వైకాపా అభర్థి మధుసూదన్ గెలిచారు. 
 
శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నత్తు రామారావు విజయం సాధించారు. పశ్చిమ గోదావరి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్‌, వంకా రవీంద్రనాథ్‌ గెలుపొందారు.  ఉపాధ్యాయ, పట్టుబధ్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన కౌంటిగ్ జరగుతోంది.