విజయంపై వైసీపీ ధీమా... జడ్పీ ఛైర్మన్ పదవుల జాబితా ఖరారు
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తమ విజయం ఖాయమని వైసీపీ ఇప్పటికే ధీమాగా ఉంది. అందుకే ముందు చూపుతో ఛైర్మన్ పదవుల జాబితా కూడా సిద్ధం చేసింది. జిల్లా పరిషత్, మండల పరిషత్ అధ్యక్షుల పేర్లపై కసరత్తు చేసిన వైకాపా, ఒక్కో జిల్లా జాబితా ఇపుడే విడుదల చేస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు తమ పార్టీ అభ్యర్థుల జాబితాను వైకాపా దాదాపు ఖరారు చేసింది. జడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనున్న విషయం విదితమే. దాదాపు అన్ని జిల్లా పరిషత్లనూ కైవసం చేసుకుంటామని అధికార వైకాపా అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో జడ్పీ ఛైర్మన్ అభ్యర్థులపై కసరత్తు చేసింది. హైకోర్టు తీర్పు ఆధారంగా ఇపుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ రేపు ఆదివారం జరుగుతోంది. ఆ వెంటనే ఛైర్మన్లు తమ స్థానాల్లో స్థానిక స్వపరిపాలన చేయాలని పార్టీ ఉద్దేశంగా ఉంది. వైసీపీ జడ్పీ ఛైర్మన్ల జాబితా ఇది.
విజయనగరం - మజ్జి శ్రీనివాసరావు
విశాఖపట్నం - శివరత్నం
గుంటూరు - క్రిస్టినా
ప్రకాశం - బూచేపల్లి వెంకాయమ్మ
పశ్చిమగోదావరి - కవురు శ్రీనివాస్
కృష్ణా - ఉప్పాళ్ల హారిక
కడప - ఆకేపాటి అమర్నాథరెడ్డి
నెల్లూరు - ఆనం అరుణమ్మ