శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

వైకాపా ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నుమూత

bhageeratha reddy
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన వైకాపా ఎమ్మల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నమూశారు. కాలేయ, ఊపిరితిత్తుల సమస్య, దగ్గుతూ బాధపడుతూ వచ్చిన ఆయన్ను హైదరాబాద్ నగరంలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తూ వచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 46 యేళ్లకే ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆయన కుటుంబం బోరున విలపిస్తుంది. వైకాపా శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. 
 
ఈయన అంత్యక్రియలు గురువారం జరుగనున్నాయి. ఈయన దివంగత చల్లా రామకృష్ణా రెడ్డి కుమారుడు. ఎమ్మెల్సీగా ఉన్న చల్లా రామకృష్ణారెడ్డి మరణించడంతో చల్లా భగీరథ రెడ్డికి ఆ టిక్కెట్ ఇచ్చారు. ఈయన తొలుత కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పని చేసారు. 2019 తండ్రి మరణంతో వైకాపాలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తండ్రి మరణానంతరం ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.