1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Ganguly's big-brother bond seals Yuvraj's DC move as duo targets IPL breakthrough

గత పాతికేళ్లుగా నీ అసిస్టెంట్‌గానే ఉన్నాను.. గంగూలీతో యువరాజ్

Yuvraj
భారత దిగ్గజ మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. నువ్వు నా అసిస్టెంట్ అవుతావా అని సౌరవ్ గంగూలీ ప్రశ్నించగా, గత 25 యేళ్లుగా నీకు అసిస్టెంట్‌గానే కదా ఉన్నాను. ఇపుడూ నా పని అదే కదా అంటూ చేసిన వ్యాఖ్యానించారు.
 
భారత క్రికెట్ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన ఈ ఇద్దరు మేటి క్రికెటర్లు ఇపుడు ప్లేయర్లు కాదు.. కోచ్‌లుగా మారారు. వచ్చే ఐపీఎల్ సీజన్‌ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు చేసింది. ఆ జట్టు ప్రధాన కోచ్‌గా సౌరవ్ గంగూలీని ఇటీవలే నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు యువరాజ్‌ను ఢిల్లీ జట్టుకు అసిస్టెంట్, బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. తన ఎంట్రీ సందర్భంగా గంగూలీతో యువీ సరదా సంభాషణ ఇలా..
 
గంగూలీ : నువ్వు నా అసిస్టెంట్ అవుతావా? 
 
యువీ : (నవ్వుతూ) నేను గత 25 ఏళ్లుగా నీకు అసిస్టెంట్‌నే కదా.. ఇప్పుడూ నా పని అదే.
 
శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ లాంటి యువ క్రికెటర్లకు యువరాజ్‌ మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఫ్రాంచైజీ కోచింగ్ సెటప్‌లోకి అడుగు పెట్టడంపై యువీ హర్షం వ్యక్తం చేశారు. 'ఈ బాధ్యతల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. కెరీర్‌లో నన్ను ప్రోత్సహించిన గంగూలీని గురువుగా, పెద్దన్నలా భావిస్తా. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆటగాళ్లందరినీ కలుపుకొని వెళ్లడం, గెలుపు సంస్కృతిని అలవర్చడంలో గంగూలీ శైలే వేరు. ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది' అని యువీ చెప్పుకొచ్చారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఉప్పల్‌‌లో భారత్-వెస్టిండీస్ మ్యాచ్...భద్రతా ఏర్పాట్లు.. కఠిన నిబంధనలు