శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By జె
Last Modified: సోమవారం, 1 ఏప్రియల్ 2019 (21:38 IST)

రేయ్.. ఆ రెండూ కోసేస్తా.. మరోసారి బూతు పురాణం మొదలెట్టిన జెసీ

కోపమొస్తే తనా, మనా బేధం లేదు. ఎవరైనా సరే చెడామడా తిట్టేయ్యాల్సిందే... అది అనంతపురం ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి నైజం. ఇప్పటివరకు ఎంతోమంది టార్గెట్ చేస్తూ తిడుతూ ఎప్పుడూ వార్తల్లో ఉండే జెసి దివాకర్ రెడ్డి మరోసారి అలాంటి పనే చేశారు. ఏకంగా తెలుగుదేశం పార్టీ నేతలనే బూతులు తిట్టారు. 
 
అనంతపురం జిల్లా పుట్టూరు ప్రాంతంలో సింగనమల టిడిపి అభ్యర్థికి మద్ధతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో టిడిపి అభ్యర్థి అడ్డుపడ్డారు. దీంతో జె.సికి చిర్రెత్తుకొచ్చింది. రేయ్.. ఆ రెండూ కోసేస్తా.. నన్నే ఆపుతావా.. ఖబడ్డార్.. దిగి పోరా.. ఇక్కడ ఉండొద్దు అంటూ టిడిపి నేతపైనే కేకలు వేశారు. దీంతో అక్కడున్న టిడిపి నాయకులు, కార్యకర్తలందరూ ఆశ్చర్యపోయారు.