గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (20:43 IST)

వైసిపిలోకి మరో 20 మంది టిడిపి ముఖ్య నేతలు..!

ఎన్నికలు  సమీపిస్తున్న వేళ అధికార పార్టీ నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎంపిలు వైసిపిలోకి వెళ్ళగా, మరో మంత్రి అలాగే ఎమ్మెల్యేలు, పార్టీలోని ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కేంద్రమంత్రి కూడా టిడిపిని వీడే ఆలోచనలో ఉన్నారట.
 
ఇది నిజంగా టిడిపికి పెద్ద షాకే అంటున్నారు విశ్లేషకులు. సర్వేలన్నీ వైసిపికి అనుకూలంగా రావడం... ఈసారి జగన్ సిఎం కావడమన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీట్లు ఇవ్వడంలో బాబు ఆలస్యం చేస్తుండటంతో నేతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు కొంతమంది సీనియర్ నేతలకు బెర్త్‌లను బాబు కన్ఫామ్ చేయకపోవడం కూడా పార్టీని నేతలు వీడడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. పార్టీని వీడి వెళ్ళిపోతున్న నేతలను చంద్రబాబు బుజ్జగించి సీటు ఇచ్చి ఆపుతారా.. లేకుంటే లైట్ తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే.