గురువారం, 25 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 మే 2024 (13:27 IST)

ప్రతి వాలంటీర్ రాజీనామా చేసి వైకాపా జెండా కప్పుకుని ప్రచారం చేయాలి : వైకాపా అభ్యర్థి దువ్వాడ

duvvada srinivas
శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వైకాపా అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ వాలంటీర్లను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతి వాలంటీర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి వైకాపా జెండా కప్పుకుని వైకాపా అభ్యర్థుల తరపున ప్రచారం చేయాలని కోరారు. ఇపుడు రాజీనామాలు చేసిన వారినే జూన్ నాలుగో తేదీన మళ్లీ విధుల్లోకి తీసుకుంటామన్నారు. ప్రతి వాలంటీర్ రాజీనామా చేసి వైకాపా కండువా కప్పుకుని ప్రచారం చేయాలని ఆయన కోరారు. 
 
తమ మాట వినని వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తామంటూ హెచ్చరికలు చేశారు. టెక్కలిలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దువ్వాడ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వాలంటీర్లంతా విధులకు దూరంగా ఉంటున్నారు. వీరిలో కొందరు వైకాపా నేతల ఒత్తిడికి తలొగ్గి తమ పదవులకు రాజీనామాలు చేశారు. మరికొందరు మాత్రం దూరంగా ఉంటున్నారు. ఇలాంటి వారికి దువ్వాడ శ్రీనివాస్ గట్టి వార్నింగ్ ఇచ్చారు.