సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 మే 2024 (22:15 IST)

మీ అన్న పవన్ కళ్యాణ్ ఉన్నాడు... నేను పారిపోను.. మీరు ధైర్యంగా ఉండాలి.. తిరగబడాలి : పవన్

pawan kalyan
ఒక సమస్యపై ధైర్యంగా నిలబడాలి. పోరాడాలి. తిరగబడాలి అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మీ అన్న పవన్ కళ్యాణ్ ఉన్నాడు.. వాడు ఉండగా మీకు కష్టం ఏంటి? నేనున్నాను కదా... నేను పని చేస్తా.. ఈ ఇద్దరితో పని చేయిస్తా.. ఈ మేరకు హామీ ఇస్తున్నా.. నేను పారిపోను.. కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లు తుడవని అధికారం ఎందుకు? అని పవన్ వ్యాఖ్యానించారు. 
 
విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో బుధవారం వారాహి విజయభేరీ సభలో ఆయన పాల్గొన్నారు. ఏపీలోని జగన్ ప్రభుత్వాన్ని మార్చండి.. తీసుకెళ్లి తుంగలో తొక్కండి అంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు. మార్చుదాం.. సంకల్పిద్దా.. బలమైన భవిష్యత్‌ను నిర్మించుకుందాం అని పేర్కొన్నారు. 
 
మీకు జగన్ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయలేదు. ఉపాధి అవకాశాలు కల్పించలేదు. అతడికి ఓటేస్తారా? మరి ఏం చేద్దాం.. జగన్‌ను గద్దె దించుదాం.. మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం... ఒక సమస్యపై  ధైర్యంగా నిలబడాలి, తిరగబడాలి అంటూ పిలుపునిచ్చారు. 
 
పనిలోపనిగా జగన్ ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. ఏ మూలకు వెళ్లినా భూ కబ్జా బాధితులు కనిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం మూడు కబ్జాలు, ఆరు సెటిల్మెంట్లతో ఉందన్నారు. దీనిపై మాట్లాడాల్సింద.. చొక్కా పట్టి నిలదీయాల్సింది ప్రజలేనని, ప్రజలు రోడ్లపైకి వచ్చి పోరాడితేనే మార్పు తథ్యం అని పవన్ అన్నారు. అంతేకానీ, ప్రసంగిస్తుంటే ఎరుపు కండువాలు విసిరితే  ప్రయోజనం లేదని పవన్ వ్యాఖ్యానించారు.