1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 2 జనవరి 2017 (10:13 IST)

హ్యాపీ న్యూస్.. 105వ ఏట అడుగుపెట్టిన బామ్మ.. శాకాహారమే దీర్ఘాయుష్షుకు కారణం.. ఎవరైనా ఇంటికొస్తే?

ప్రపంచం మొత్తం కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న వేళ ఆ బామ్మ 104 పూర్తి చేసుకుని 105 ఏట అడుగుపెట్టింది. ఆమే గుంటూరు, యడ్లపాడుకు చెందిన గాలి తులశమ్మ. ఆదివారం తులశమ్మ 105వ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్య

ప్రపంచం మొత్తం కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న వేళ ఆ బామ్మ 104 పూర్తి చేసుకుని 105 ఏట అడుగుపెట్టింది. ఆమే గుంటూరు, యడ్లపాడుకు చెందిన గాలి తులశమ్మ. ఆదివారం తులశమ్మ 105వ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు నిరాడంబరంగా జరుపుకున్నారు. పుట్టిన నాటి నుంచి శాకాహారిగా ఉండడం వల్లే ఎలాంటి అనారోగ్యం దరిచేరలేదనీ, అదే తన దీర్ఘాయుష్షు రహస్యమనీ తులశమ్మ చెప్తోంది.  
 
నేటికీ కళ్ళ జోడు లేకుండా స్పష్టంగా చూడగలుగుతోంది. వినికిడిలోపం కూడాలేదు. కొత్తవారు ఎవరైనా ఇంటికి వస్తే మర్యాద పూర్వకంగా లేచి నిలబడుతోంది. తాను తిన్న ప్లేటు, గ్లాసులను కూడా తానే శుభ్రం చేసుకుంటుంది. 
 
ఐదు తరాలకు ప్రతినిధి అయిన ఈ బామ్మ తెనాలి సమీపంలోని కటేవరానికి చెందిన కడియాల వెంకయ్య, భారతిలకు 1913 జనవరి 1న జన్మించింది. ఆమె భర్త హనుమయ్య 85 ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచారు. గత 30 ఏళ్ళుగా కుమార్తె భారతి, అల్లుడు గంగయ్య చౌదరి వద్దనే ఉంటున్నది. ఐదు తరాలకు చెందిన 35 మంది మనుమళ్ళు, మనుమరాళ్ళు, మునిమనుమలు, మనుమరాళ్ళను చూసి ఎంతో సంతోషిస్తోంది. 2015లో మీ సేవా కేంద్రానికి స్వయంగా వెళ్ళి ఆధార్‌ కార్డును పొందడమే కాకుండా ఓటు హక్కును పునరుద్ధరించుకోవడం విశేషం.
 
ఇక ఎనిమిది మంది సంతానంలో తులశమ్మే అందరికంటే పెద్దది. ఆమెకు ఐదుగురు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్లు కాగా చిన్న చెల్లెలు, పెద్ద తమ్ముడు మినహా అందరూ కాలం చేశారు. నర్సరావుపేట సమీపంలోని కళ్ళగుంట గ్రామానికి చెందిన గాలి హనుమయ్యతో సుమారు 15 సంవత్సరాల వయస్సులో వివాహమైంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. ఉన్నారు.