1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 మే 2025 (22:59 IST)

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

vishal couple
కోలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది. ఆయన హీరోయిన్ సాయి ధన్షికను పెళ్లాడనున్నారు. వీరిద్దరి వాహం ఆగస్టు 29వ తేదీన జరుగనుంది. సోమవారం రాత్రి చెన్నైలో జరిగిన ఓ సినిమా ఆడియా రిలీజ్ వేడుకలో ఈ విషయాన్ని వారిద్దరూ వెల్లడించారు. తమ పెళ్లి ఆగస్టు 29వ తేదీన జరుగుతుందని తెలిపారు. 
 
దీనిపై విశాల్ మాట్లాడుతూ, సాయి ధన్షిక చాలా మంచి వ్యక్తి. మేం కలిసి అద్భుతమైన జీవితాన్ని ప్రారంభించబోతున్నాం. పెళ్లి తర్వాత కూడా ఆమె నటిస్తుంది అని విశాల్ ప్రకటించారు. 
 
కొంతకాలం క్రితం మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. విశాల్ ఎపుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా అని ధన్షిక వెల్లడించారు. కాగా, రజనీకాంత్ కబాలీ చిత్రంలో కీలక పాత్రను పోషించిన ధన్షిక... షికారు, అంతిమ తీర్పు, దక్షిణ తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు.