శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 26 జులై 2021 (08:00 IST)

టీడీపీలోకి 30 వైసీపీ కుటుంబాలు.. ఎక్కడ?

కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని చిన్న భూంపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు చాకలి శివన్న, మాధవరం శివన్న, కల్లూరు వెంకటస్వామి, బిచ్చాలు రాముడు, బెళగల్‌ హుశేని, చంద్ర, బడాయి నారాయణ, మాధవరం హుశేని, పెద్దభూంపల్లి శ్రీరాములుతో పాటు దాదాపు 30 కుటుంబాలు ఆదివారం మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి తిక్కారెడ్డి, చిన్నభూంపల్లి మాజీ సర్పంచ్‌ నరసింహులు ఆధ్వర్యంలో  తెలుగుదేశం పార్టీలోకి చేరారు.

వారికి తిక్కారెడ్డి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు సేవ చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి సురేష్‌ నాయుడు, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్‌ రెడ్డి, జంపాపురం మాజీ సర్పంచ్‌ కృష్ణారెడ్డి, తిప్పలదొడ్డి నీలకంఠా రెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి సోల్మాన్‌ రాజు, బెళగల్‌ సర్పంచు మాల పద్మమ్మ, రామయ్య పాల్గొన్నారు.