గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2020 (21:59 IST)

మహారాష్ట్రలో కుప్పకూలిన 5 అంతస్తుల భవనం

మహారాష్ట్రలో ఘోరం జరిగింది. ఐదు అంతస్తుల భవనం ఒకటి సోమవారం రాత్రి కుప్పకూలిపోయింది. ఈ భవన శిథిలాల కింద 100 మంది వరకు చిక్కుకున్నట్టు సమాచారం. ఇందులో 25మందిని రక్షించారు. మిగిలినవారంతా శిథిలాల కింద చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. 
 
ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు.  
 
తారిఖ్ గార్డెన్‌గా పేరున్న ఈ భవనం పదేళ్ల క్రితం నాటిది. 40 అపార్ట్‌మెంట్‌లున్నాయి. సాయంత్రం ఆరు గంటల సమయంలో కుప్పకూలిందని పోలీస్ అధికారులు తెలిపారు. కూలిపోయే సమయంలో చాలామంది బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.