ఇంట్లో అడ్డా పెట్టిన చిరుత పులి.. పక్కలో నాలుగు పిల్లలు.. ఎక్కడ?
సాధారణంగా గ్రామాల్లోని ఇళ్ళ పక్కనే బర్రెలు, గొర్రెలు, మేకలు, ఎద్దులు కట్టేసేందుకు దొడ్లు ఉంటాయి. ఈ దొడ్లలలో కుక్కలు, పిల్లులు కూడా ఉంటుంటాయి. ఈ దొడ్లలోనే ఇవి పిల్లలను కంటుంటాయి. ఆ పిల్లలు కుయ్ కుయ్ అంటూ అరుస్తుంటే వినేందుకు, చూసేందుకు చూడ ముచ్చగా ఉంటాయి. అయితే, ఆ గ్రామంలో మాత్రం ఏకంగా ఓ చిరుత పులి ఏకంగా అడ్డా పేట్టేసింది. చిరుత ఒక్కటే అనుకుని పొరబడేరు.. ఈ ఒక్క చిరుత పులి ఏకంగా నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది.
ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు మాత్రం రావడానికి వచ్చారుగానీ.. దగ్గరకు వెళ్లేందుకు మాత్రం సాహసం చేయలేదు. ఎందుకంటే.. తన పిల్లల వద్దకు ఎవరైనా వస్తున్నట్టు చూస్తే ఆ చిరుత పైకి ఉరుకుతోంది. దీంతో అధికారులు చేతులెత్తేసి.. పిల్లలు కాస్త పెద్దవి అయ్యాక పట్టుకెళ్ళి అడవిలో వదిలిపెడతామని సెలవిచ్చి వెళ్లిపోయారు.
పైగా, అప్పటివరకు వీటికి తిండిగట్రా తామే చూసుకుంటామని గ్రామస్థులకు హామీ ఇచ్చి వెళ్లిపోయారు. ఇక్కడో విచిత్రం ఉంది. గ్రామంలోకి చిరుత పులి వస్తే ఆ గ్రామస్థులంతా భయంతో వణికిపోతారు. కానీ, ఈ గ్రామ ప్రజలు మాత్రం పోతేపోనీలే అని మిన్నకుండిపోయారట. ఎందుకంటే.. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండే గ్రామంలో క్రూరమృగాలు వచ్చిపోవడం సహజమేనట. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని ఇగత్పురి అనే ఏరియాలో జరిగింది.