శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 20 డిశెంబరు 2017 (09:46 IST)

విజయ్ ఎందరో అమ్మాయిలను బెడ్‌రూమ్‌కు తీసుకొచ్చేవాడు: వనిత

టాలీవుడ్ హాస్య నటుడు విజయ్ భార్య వనితా రెడ్డి మీడియాపై మండిపడింది. విజయ్ సాయి ఇంటి నుంచి తాను కారు దొంగలించుకుని తీసుకెళ్లానని వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని.. వాస్తవాలను తెలుసుకోకుండా తప్పుడు వ

టాలీవుడ్ హాస్య నటుడు విజయ్ భార్య వనితా రెడ్డి మీడియాపై మండిపడింది. విజయ్ సాయి ఇంటి నుంచి తాను కారు దొంగలించుకుని తీసుకెళ్లానని వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని.. వాస్తవాలను తెలుసుకోకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. విజయ్ ఎంతోమంది అమ్మాయిలను బెడ్‌రూమ్‌కి తీసుకొచ్చేవాడని.. డబ్బు కోసం వేధించేవాడని.. తనను ఎన్నోసార్లు కొట్టాడని వనిత చెప్పుకొచ్చింది. 
 
గురువారం పోలీసులకు లొంగిపోతున్నట్లు వనిత తెలిపింది. ఓ టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీడియాపై ఆమె నిప్పులు చెరిగింది. మహిళకు మీడియా ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించింది. మహిళ అని కూడా చూడకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా తనపై తప్పుడు కథనాలు రాశారని మండిపడింది. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని కోరింది. 
 
కారు కోసం గొడవ జరగలేదని, ఆ కారు తనదేనని.. కారు కోసం హ్యుందాయ్ షోరూమ్ వాళ్లని తీసుకెళ్లానని వనిత వెల్లడించింది. మీడియా వైఖరి సరిగా లేదని అన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని చెప్పారు. విజయ్‌కి సినిమాలు లేకపోయినప్పటికీ.. కలిసి బతుకుదామని భరోసా ఇచ్చినా... అతడు తనపై చెడు ప్రచారం చేశాడని వాపోయింది. విజయ్ తల్లిదండ్రుల వల్లే తమ మధ్య విభేదాలు తలెత్తాయని వనిత తెలిపింది.