బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 19 డిశెంబరు 2017 (19:36 IST)

ఇదీ విజయ్ అసలు రూపం... బయటపెట్టిన వనిత, అవి 'ఎయిడ్స్' ఫోటోలనీ...

హాస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆయన భార్య వనిత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. విజయ్ ఆత్మహత్యకు ఆమె కారణమంటూ ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో ఆమె ఓ సెల్ఫీ వీడియోను మీడియాకు రిలీజ్ చేసింది. అందులో ఆమె మాట్లాడుతూ... విజయ్ సాయికి ఓ అ

హాస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆయన భార్య వనిత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. విజయ్ ఆత్మహత్యకు ఆమె కారణమంటూ ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో ఆమె ఓ సెల్ఫీ వీడియోను మీడియాకు రిలీజ్ చేసింది. అందులో ఆమె మాట్లాడుతూ... విజయ్ సాయికి ఓ అమ్మాయితో సంబంధం వుందంటూ ఆరోపణ చేసింది. దానితోపాటు విజయ్ సాయి ఓ యువతితో సన్నిహితంగా వున్న ఫోటోను పోస్ట్ చేసింది. విజయ్ సాయి చరిత్ర మొత్తం తనవద్ద వున్నదనీ, అవన్నీ తీసుకుని పోలీసులు ముందు లొంగిపోతానని ఆమె సెల్ఫీ వీడియోలో తెలిపింది. 
 
మరోవైపు విజయ్ తండ్రి సుబ్బారావు తన కుమారుడు ఆత్మహత్యకు కారణం వనితేనని ఫిర్యాదు చేశారు. తన కుమారుడు విజయ్ తో వున్న అమ్మాయి ఫోటో సినిమా షూటింగుకు చెందినదనీ, ఎయిడ్స్ అవగాహన కోసం ఓ ప్రకటనను చేశారనీ, అందులో విజయ్ నటించారని చెప్పారు. ఆ ప్రకటన షూట్ చేసినప్పుడు ఓ అమ్మాయితో విజయ్ అలా నటించాడనీ, అంతేతప్ప తన కుమారుడికి ఎవరితోనూ లింకులు లేవని తెలిపారు. ఈ ఫోటోలతో తమను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారనీ, 
 
కేసు నమోదు చేసుకొన్న పోలీసుల దర్యాప్తులో అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.. వనిత కి రెండు పేర్లు.. ఇద్దరు తండ్రులు వంటి అనేక షాకింగ్ నిజాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి.. ఈ నేపథ్యంలో వనిత తన భర్త విజయ్ కు ఓ అమ్మాయితో సంబంధం ఉందని ఆరోపిస్తూ.. ఓ అమ్మాయితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను మీడియాకు విడుదల చేసింది. మరి కొన్ని వీడియోలు.. ఫోటోలతో లొంగి పోతానని.. వనిత సెల్ఫీ వీడియో ద్వారా ప్రకటించింది.. కాగా మీడియాకు విడుదల చేసిన ఫోటోలపై విజయ్ తండ్రి సుబ్బారావు స్పందిస్తూ.. షాకింగ్ నిజాలను బయట పెట్టారు..
 
వనిత మీడియాకు రిలీజ్ చేసిన ఫోటోలు ఇప్పటివి కావని.. అవి సుమారు నాలుగేళ్ల క్రితం ఫోటోలు అని చెప్పారు.. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఒక మోడల్.. ఆ అమ్మాయితో కలిసి విజయ్ ఎయిడ్స్ అవర్ నెస్ యాడ్ లో నటించాడు.. ఆ ఫోటోలు అప్పటివి అని క్లారిటీ ఇచ్చాడు.. ఆ ఫోటోలో అమ్మాయితో విజయ్ కు ఎటువంటి సంబంధం లేదు.. అదంతా నటనలో భాగంగా తీసిన ఫోటోలే.. అని ఆయన చెప్పారు.
 
ఈ ఫోటోలనే ఆయుధం గా చేసుకొని మమ్మల్ని బ్లాక్ మైల్ చేయాలని చూస్తుంది అని విజయ్ తండ్రి చెప్పారు. డబ్బుకోసమే ఆమె ఇదంతా చేస్తుంది.. ఇప్పటికే డబ్బు, నగలు, కారు అన్నీ తీసుకొని వెళ్లింది.. అని విజయ్ తండ్రి సుబ్బారావు తెలిపారు. పోలీసులు మరింత లోతుగా విచారిస్తే.. ఆమె గురించి అసలు నిజాలు బయట పడతాయని ఆయన చెప్పారు.. కాగా వనిత సెల్ఫీ ఆధారంగా ఆమె కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు.. అరెస్ట్ కు రంగం సిధ్ధం చేస్తున్నారు.