మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2019 (08:19 IST)

వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక విచారణ

వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు కీలక విచారణ జరగనుంది. ఈ కేసులో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని సిట్ అధికారులు విచారించనున్నారు. ఉదయం 11 గంటలకు కడప శివారులోని పోలీసు శిక్షణ కేంద్రానికి విచారణకు హాజరు కావాలని సీఆర్పీసీ 160 కింద నోటీసు ఇచ్చారు. 
 
మార్చి 15న పులివెందులలో వివేకా హత్య జరిగితే... 8 నెలల తర్వాత మాజీమంత్రిని విచారణకు పిలుస్తున్నారు. హత్య జరిగిన రోజే కొందరు వైకాపా నాయకులు ఆదినారాయణరెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. పది రోజుల నుంచి కడపలో జరుగుతున్న సిట్ విచారణలో పలువురు కీలక నేతలను విచారిస్తున్నారు. 
 
ఇందులో భాగంగా నేడు ఉదయం ఆదినారాయణరెడ్డి విచారణకు హాజరుకానుండటం చర్చనీయాంశమైంది. ఈ నెల 5న ఆదినారాయణరెడ్డి సోదరుడు దేవగుడి నారాయణరెడ్డిని సైతం సిట్ అధికారులు విచారించారు. 
 
ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని... తప్పుందని తేలితే బహిరంగంగా ఉరేసుకుంటానని ఇప్పటికే అదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. వివేకా కేసు విచారణ సిట్​కు చేతకాకుంటే సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్​ చేశారు.