రాజీవ్ హంతకురాలు నళిని నిరాహార దీక్ష
మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హంతకురాలు ఎస్ నళిని శ్రీహరన్ వెల్లూరు మహిళా జైలులో శనివారం నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆమె ప్రస్తుతం తన భర్తతోపాటు జీవిత ఖైదు అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.
నళిని శుక్రవారం రాత్రి జైలు అధికారులకు ఓ లేఖ సమర్పించారు. తాను శనివారం నుంచి నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. శనివారం ఉదయం ఆమె అల్పాహారాన్ని స్వీకరించేందుకు నిరాకరించారు.
తనతోపాటు తన భర్త శ్రీహరన్ వురపు మురుగన్ 28 ఏళ్ళ నుంచి జైలు జీవితం గడుపుతున్నామని, తమను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమకు ఒకే ఒక కుమార్తె ఉందని, ఆమెకు తాము దూరమయ్యామని పేర్కొన్నారు.
తమను త్వరగా విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పిటిషన్లను ఆమె సమర్పించారు.