శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (22:55 IST)

ఆటో డ్రైవర్‌ కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించాడు.. యువతి దూకేసింది..

auto
విశాఖలో తన వాహనం ఎక్కిన ఓ మహిళను ఆటో డ్రైవర్‌ కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. డ్రైవర్ తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని పసిగట్టిన మహిళ మూడు ఆటో నుంచి దూకింది. 
 
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆటో డ్రైవర్‌ పరారీలో వుండగా, మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
 
వివరాల్లోకి వెళితే... నగరంలోని ద్వారకానగర్‌ ఏరియాలో ఓ బంగారం షాప్‌లో అరిలోవ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ళ యువతి పనిచేస్తుంది. రోజులానే విధులు ముగిసిన అనంతరం ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. 
 
అయితే డ్రైవర్‌ ఆటోను అరిలోవ వైపు కాకుండా రైల్వే స్టేషన్‌ వైపు తీసుకెళ్లడం యువతి గుర్తించిన గట్టిగా ప్రశ్నించింది. ఆపై అతను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని గమనించిన యువతి ఆటో నుంచి దూకేసింది.