ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 24 జులై 2019 (19:10 IST)

స్థానికులకే 75 శాతం ఉద్యోగ అవకాశాలు ... ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లు

కర్మాగారములలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లును కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ... చరిత్రాత్మక బిల్లును ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ప్రవేశపెట్టే అవకాశం లభించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

సీఎం వైయస్‌ జగన్‌ అందరికీ న్యాయం చేస్తున్నారని తెలిపారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలకు నిధులు కేటాయిస్తున్నామన్నారు. పరిశ్రమలు, ఫ్యాక్టరీలో 75 శాతం ఉద్యోగాలు స్ధానికులకే అని జయరాం తెలిపారు. చంద్రబాబు ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగులను మోసం చేశారని, మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు జగన్‌ అని అన్నారు. 
 
 ఈ సందర్భంగా బిల్లుపై కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌ రెడ్డి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, గూడూరు ఎమ్మెల్యే ఆర్‌.వరప్రసాదరావు, పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌ రెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు తదితరులు మాట్లాడారు.