మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 24 జులై 2019 (19:03 IST)

అందం పేరుతో చెరువు ధ్వంసం- నారాయణ అవినీతి వల్లే .. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి

నెల్లూరు చెరువు మిగులు జలాల మళ్లింపు కాలువలో అక్రమాలు జరిగాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి సంబంధిత శాఖా మంత్రిని కోరారు. నెల్లూరు చెరువును సుందరీకరణ పేరుతో గత ప్రభుత్వం నాశనం చేసి రైతుల నోట్లో మట్టి కొట్టిందని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.

ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన నెల్లూరు చెరువు సామర్త్యాన్ని గత ప్రభుత్వం ఎలా తగ్గించిందో వివరించారు. కేంద్రం అమృత పథకం కింద ఇచ్చిన నిధులను స్వాహా చేసేందుకు నెల్లూరు చెరువు సుందరీకరణ పేరుతో కుంభకోణానికి పాల్పడ్డారని అన్నారు. ఇరిగేషన్‌ అధికారుల అనుమతి లేకుండా వేలాది మంది రైతుల నోళ్లలో మట్టికొట్టారని అన్నారు. తనకు సంబంధం లేని ఇరిగేషన్‌ చెరువును నాశనం చేయడంలో అప్పటి మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ ప్రమేయాన్ని ప్రస్తావించారు.

దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. సభ్యులు చెబుతున్న అంశాలు పరిగణలోకి తీసుకొని సమగ్రమైన దర్యాప్తు చేసి తప్పు చేసినవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.