గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 24 జులై 2019 (18:16 IST)

గ్రామ వాలంటీర్లను మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేయండి... హైకోర్టులో యువజన కాంగ్రెస్ పిల్

గ్రామ వాలంటీర్లను మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేయాలని కోరుతూ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. గ్రామ వాలంటీర్ల పోస్ట్ ల నియామకాలకు సంబంధించి జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 104, 22-06-2019 వెంటనే నిలుపుదల చేసి మెరిట్ ప్రాతిపదికన నియామకాలు జరపాలని పిల్ లో అభ్యర్థించారు.

గ్రామ వాలంటీర్లను ఇంటర్వ్యూ ప్రాతిపదికన కాకుండా మెరిట్ ద్వారా ఎంపిక చెయ్యాలని, గ్రామ వాలంటీర్లు పోస్టులకు విద్యార్హతను బట్టి వెయిటేజీ ఇవ్వాలని కోరారు. మెరిట్ ప్రాతిపదికన కాకుండా ఇంటర్వ్యూల ద్వారా వైస్సార్సీపీ పార్టీకి చెందిన వారిని గ్రామ  వాలంటీర్లుగా నియమించుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నారని పిల్ లో పేర్కొన్నారు.

ప్రజలు కడుతున్న పన్నులతో, ప్రజాధనంతో జరుపుతున్న నియామకాలు పారదర్శకతతో చేపట్టాలి తప్ప ఒక పార్టీకి అనుకూలమైన వారితో నియామకాలు జరపడం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు.