సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 24 జులై 2019 (18:03 IST)

మెదక్ జిల్లా ఎస్పీకి జగన్ సమీప బంధువుతో పెళ్లి? ఆయనెవరో?

తెలంగాణలో మెదక్ జిల్లా ఎస్పీగా పనిచేస్తూ తన పనితనంతో గుర్తింపు సంపాదించుకున్న ఐపీఎస్ అధికారిణి ఎస్పీ చందన దీప్తి పెళ్లిపై రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. చందన దీప్తి ఇంట త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయని వార్తలు వస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఏపీ సీఎం జగన్ సమీప బంధువుతో మెదక్ జిల్లా ఎస్పీకి వివాహం కుదిరిందని టాక్ వస్తోంది. 
 
మెదక్ ఎస్పీకి కాబోయే వరుడు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించి స్వదేశానికి వచ్చి కన్స్ట్రక్షన్ మరియు హాస్పిటాలిటీ వ్యాపార రంగంలో స్థిరపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి పెళ్లి పట్ల తెలంగాణలోని కొందరు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పుడు జగన్ బంధువు అని తెలియటంతో అతనెవరో తెలుసుకునే పనిలో పడ్డారట.