గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 మే 2022 (18:45 IST)

రూ.60 వేల కోట్లతో పవర్ ప్రాజెక్టుకు ఒప్పందం

ys jagan - adani
అదానీ గ్రీన్ ఎనర్జీ ఇక్కడ జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF)లో రెండు మెగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది 60,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 3,700 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టు, 10,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తుంది.
 
అంతకుముందు దావోస్ వేదికగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డిలు కలుసుకుని చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పెట్టుబడుల కోసం అదానీ గ్రూప్ అన్వేషించగల సంభావ్య రంగాలు, వనరులను సీఎం వివరించారు. ఏపీ ప్రభుత్వం తరపున ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పరిశ్రమలు, వాణిజ్యం) ఆర్.కరికల్ వలవెన్, అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన ఆశిష్ రాజ్ ఎంఓయూపై సంతకాలు చేశారు.