శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 4 డిశెంబరు 2018 (20:09 IST)

అతనో ఎగ్జిక్యూటివ్.. 11 మందితో 11 జిల్లాల్లో అక్రమ సంబంధం...

విజయవాడ బందర్ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ సర్కిల్‌కు దగ్గరలో ఉన్న ప్రాంతమది. అక్కడే నివాసముండేవాడు క్రిష్ణయ్య. ఎం.టెక్ కంప్లీట్ చేశాడు. ఉద్యోగం కోసం ఆరునెలల పాటు తిరిగాడు. అయితే ఉపయోగం లేకుండా పోయింది. చివరకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా అవతారమెత్తాడు. మార్కెటింగ్‌కు చెందిన కొన్ని ప్రాజెక్టులను విక్రయించడానికి ఇంటింటికీ వెళ్ళేవాడు. అలా తన జీవితాన్ని ప్రారంభించాడు. కష్టపడి ఉద్యోగం చేసుంటే క్రిష్ణయ్య వార్తల్లో నిలిచేవాడు కాదు. 
 
కానీ పేరుకు తగ్గట్లు అక్కడక్కడా అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. విజయవాడ నుంచి ప్రారంభించిన క్రిష్ణయ్య పెళ్ళయిన వివాహితులతో పాటు కొంతమంది యువతలను మభ్యపెట్టి లోబరుచుకున్నాడు. ఇలా విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, రైల్వేకోడూరు, కడప ఇలా అన్ని ప్రాంతాల్లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశాడు క్రిష్ణయ్య. తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోయారు. వివాహం చేసుకోలేదు. దీంతో క్రిష్ణయ్య ఆడింది ఆటగా.. పాడిందే పాటగా మారిపోయింది. అయితే ఉద్యోగం నిమిత్తం ఎగ్జిక్యూటివ్‌గా తిరుగుతూ అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. ఒకచోట నాలుగు నెలలకు మించి ఉండేవాడు కాడు. ఇలా నాలుగు సంవత్సరాల పాటు క్రిష్ణయ్య ఆటలు సాగింది.
 
అయితే చివరగా రైల్వేకోడూరుకు చెందిన ఒక యువతి ఫిర్యాదుతో క్రిష్ణయ్య బాగోతం బయట పడింది. తనతో పాటు పనిచేసే ఒక ఎగ్జిక్యూటివ్ తో వారంరోజుల పాటు గడిపిన క్రిష్ణయ్య ఆ తరువాత విజయవాడకు వెళ్ళేందుకు సిద్ధమయ్యాడు. తనను పెళ్ళి చేసుకొని వెళ్ళమని యువతి పట్టుబట్టింది. అయితే క్రిష్ణయ్య ససేమిరా అన్నాడు. దీంతో యువతి తల్లిదండ్రులు రైల్వేకోడూరు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో క్రిష్ణయ్య పాత విషయాలన్నింటినీ పోలీసులకు చెప్పేశాడు. కానీ విచారణలో తాను ఏయే జిల్లాలలో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న విషయాన్ని క్రిష్ణయ్య చెప్పాడు కానీ వారి పేర్లను మాత్రం చెప్పలేదు.