సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Modified: సోమవారం, 26 నవంబరు 2018 (14:30 IST)

వివాహితతో డి.యస్.పి అక్రమ సంబంధం... సుప్రీం తీర్పుతో పోలీసుల మల్లగుల్లాలు

తన భార్యతో మంగళగిరి డి.యస్.పి(9వ బెటాలియనుకు) చెందిన దుర్గాప్రసాద్ అక్రమ సంబంధం కలిగి వున్నాడని తిరుచానూరు పోలీస్టేషనులో భర్త రెడ్డిప్రసాద్‌ ఆదివారం కేసు నమోదు చేసాడు. బాధితుడైన భర్త రెడ్డి ప్రసాద్‌ పాత్రికేయులతో మాట్లాడుతూ ఆయన మాటలలోనే.... తన భార్య ధనలక్ష్మి తాను వివాహం చేసుకుని 7 సంవత్సారాలు గడిచింది. తమకు ఒక బాబు ఒక పాప గలరు. మేము హైదరాబాదులో నా సొంతనివాసంలో వుంటూ ఫార్మా కంపెనీలో సహాయకునిగా పనిచేసేవాడని.
 
సాఫీగా సాగుతున్న కుటుంబంలో ఒక సంవత్సరం క్రితం అక్కడే పోలీస్ డి.యస్.పిగా పనిచేసే దుర్గాప్రసాద్ మార్నింగ్ వాక్ ద్వారా తన భార్యతో పరిచియం ఏర్పరుచుకున్నాడు. వీరిరువురికి సుమారు 20 సంవత్సరాల వ్యత్యాసం వుండటంతో నేను మా కుటుంబ సభ్యలు పెద్ద మనిషిగా చేరదీసాము. అయితే పోలీసు దుర్గాప్రసాద్ నా భార్యను వక్రదృష్టిలో ఆలోచించి తనకు తితిదేలో ఉద్యోగం కల్పిస్తానని మాట ఇచ్చాడు. నా భార్య కూడా ఆయన మాటలతో ఆయన మోజులో పడి నాకు  తెలియకుండా సంవత్సరం కాలంగా అక్రమ సంబధాన్ని కొనసాగిస్తున్నారు.
 
ఉద్యోగ రీత్యా అందుకు తిరుపతిలో దగ్గరగా నివాసం ఏర్పాటు చేసుకోవాలని నా భార్యతో నాపై ఒత్తిడి తెచ్చాడు. భార్యను నమ్మి హైదరాబాదులో నా సొంత ఇంటిని వదలి తిరుపతి సమీపంలోని తిరుచానూరు గ్రామంలో ఒక అపార్ట్‌మెంట్‌లో అద్దెకు తీసుకుని కాపురం ఏర్పాటు చేసుకున్నాము. ఉద్యోగ రీత్యా నేను హైదరాబాదు వెల్లి పది పదిహేను రీజులకు ఒకపారి ఇంటికి వచ్చే వాడిని. ఈ మధ్యలో మా అమ్మ, వికాలాంగుడైన మా నాన్న తిరుచానూరులోని మా ఇంటికి వచ్చారు. ఆ సందర్భంలో నా భార్య ధనలక్ష్మి తలుపు తెరిచి మా అమ్మనాన్నలను చూసి తలుపు వేసేసింది. 
 
సందర్భాన్ని గ్రహించి నాకు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించారు. ఇంటికి వచ్చి ఫోన్‌ వాయిస్ రికార్డు పరిశీలించగా పోలీసు దుర్గాప్రసాదుతో చాలా అసభ్యంగా మాట్లాడుతున్న వాయిస్ రికార్డుని గుర్తించి మోసపోయానని తెలుసుకున్నాను. ఫోన్ తీసుకుని హైదరాబాదుకు ఉద్యగానికి వెళ్లగా అక్కడ పోలీస్ దుర్గాప్రసాద్ నా వద్ద వున్న మొబైల్ సాక్షాన్ని ఇచ్చేవలసినదిగా నాపై దాడి చేసాడు. నేను వెంటనే ఆయనపై కేసు నమోదు చేసాను. ఇప్పుడు నేను తిరుచానూరులో ఇంటివద్దకు వెళ్లి తలుపు కొట్టగా తలుపు తీసి నన్ను చూసి వెంటనే తలుపు వేసేసి మూడు రోజులైనా తీయలేదు. చివరగా మీడియా సహాయంతో వేకువ జామున నేరుగా తన పడకగదికి వెళ్లగా డియస్పి దుర్గాప్రసాద్‌తో పాటు ఇరువురు కెమరా కళ్లకు చిక్కారు అని తనకు జరిగిన అన్యాయాన్ని పాత్రికేయులకు వివరించాడు బాధితుడు. 
 
తిరుచానూరులో కేసు నమోదు చేసానని అన్నారు. తరువాత యస్.ఐ రామాంజనేయులుని కేసు సంబంధిత వివరాలు అడుగగా ఈ కేసు తాజాగా సుప్రీంకోర్టు అక్రమ కేసులలో ఇరువురు అంగీకారంతో జరిగే అక్రమ సంబంధాలు చట్టరిత్యా నేరం కాదు అని వెల్లడించిన తీర్పు మేరకు పైఅధికారులతో చర్చిస్తున్నామని అనంతరం కేసు నమోదు సంబంధిత అంశాలు తెలియజేస్తామని వివరించారు.