శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 3 జనవరి 2018 (15:05 IST)

ఐశ్వర్యారాయ్ నా తల్లి అంటున్న విశాఖ కుర్రోడు!

'బిగ్ బి' కోడలు, ప్రపంచ మాజీ సుందరి 44 యేళ్ళ ఐశ్వర్యారాయ్‌కు 27 యేళ్ల కుమారుడు ఉన్నాడట. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఐష్ తన తల్లి అని, తన తల్లి నుంచి తనను 27 యేళ్ల క్రితం దూరం చేశాడంటూ ఓ కుర్రో

'బిగ్ బి' కోడలు, ప్రపంచ మాజీ సుందరి 44 యేళ్ళ ఐశ్వర్యారాయ్‌కు 27 యేళ్ల కుమారుడు ఉన్నాడట. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఐష్ తన తల్లి అని, తన తల్లి నుంచి తనను 27 యేళ్ల క్రితం దూరం చేశాడంటూ ఓ కుర్రోడు వాపోతున్నాడు. ఇంతకీ ఆ కుర్రోడి పేరు ఏంటంటే.. సంగీత్ కుమార్. ఊరు విశాఖపట్టణం. 
 
ఐశ్వర్యారాయ్‌పై సంగీత్ స్పందిస్తూ, తాను ఐశ్వ‌ర్యారాయ్ కొడుకున‌ని, 27 ఏళ్ల క్రితం త‌న‌ను తల్లి నుంచి దూరం చేశార‌ని వాపోతున్నాడు. 1988లో ఐశ్వ‌ర్య ఐవీఎఫ్ ప‌ద్దతి ద్వారా లండ‌న్‌లో త‌న‌కు జ‌న్మ‌నిచ్చింద‌ని సంగీత్ కుమార్ ఆరోపిస్తున్నాడు. 
 
తాను రెండేళ్ల‌పాటు ఐశ్వ‌ర్య తల్లిదండ్రులు బృందారాయ్‌, కృష్ణ‌రాజ్ రాయ్‌ల వ‌ద్దే పెరిగాన‌ని, త‌ర్వాత త‌న తండ్రి ఆదివేలు రెడ్డి విశాఖ‌ప‌ట్నానికి తీసుకొచ్చేశాడ‌ని చెపుతున్నాడు. 
 
ఇపుడు 27 ఏళ్ల క్రితం దూర‌మైన త‌ల్లిని మ‌ళ్లీ క‌ల‌వాల‌నుకుంటున్న‌ట్టు చెప్పాడు. అంతేకాదు ఐశ్వ‌ర్య ఇప్పుడు అభిషేక్‌తో క‌ల‌సి లేద‌ని, ఆమె ఆరాధ్య‌తో క‌లిసి వేరేగా ఉంటోంద‌ని వ్యాఖ్యానిస్తున్నాడు. 
 
కాగా, ప‌లువురు బాలీవుడ్ హీరోలతో ప్రేమాయ‌ణం, ఆపై అమితాబ్ ఇంటి కోడ‌లు కావ‌డం ఇలా ఐష్ ఎప్పుడూ వార్త‌ల్లో వ్య‌క్తే. ప్ర‌స్తుతం ఆమె అభిషేక్ భార్య‌గా, ఓ బిడ్డ‌కు త‌ల్లిగా ప్రశాంతంగా ఉంది. తాజాగా త‌న‌కేం సంబంధంలేని ఓ విష‌యంలో ఐష్ హాట్ న్యూస్‌గా మారింది.