శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Updated : సోమవారం, 13 మార్చి 2017 (17:54 IST)

నాన్నకోసం అఖిలప్రియ... చివరిచూపు.. పెళ్లికాని ముగ్గురు పిల్లలు

భూమా నాగిరెడ్డి. కర్నూలు జిల్లాలోని ప్రజలకు ఆయనంటే ఎంతో ప్రేమాభిమానాలు. ఆయన హఠాన్మరణం జిల్లాలోనే కాదు యావదాంధ్రలోని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన అంత్యక్రియలు ఆయన సతీమణి శోభానాగిరెడ్డి ఘ

భూమా నాగిరెడ్డి. కర్నూలు జిల్లాలోని ప్రజలకు ఆయనంటే ఎంతో ప్రేమాభిమానాలు. ఆయన హఠాన్మరణం జిల్లాలోనే కాదు యావదాంధ్రలోని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన అంత్యక్రియలు ఆయన సతీమణి శోభానాగిరెడ్డి ఘాట్ ప్రక్కనే జరిగాయి. చితి వద్ద చివరిసారిగా తండ్రిని చూసి అఖిలప్రియ బోరున విలపించారు. ఆయన ముఖాన్ని పట్టుకుని మరలా బ్రతికి వస్తారేమోనన్న ఆశగా చూశారు. ఆ దృశ్యం చూసివారి అందరి హృదయాలు బరువెక్కాయి. కానీ విధి ముందు ఎంతటివారైనా తలవంచక తప్పదు కదా.
 
భూమా నాగిరెడ్డి కుటుంబంలో విషాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా భూమా శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో గత మూడున్నరేళ్ల క్రితం మరణించారు. ఆ విషాదాన్ని మర్చిపోకముందే మళ్లీ భూమా నాగిరెడ్డి గుండె పోటుతో కన్నుమూశారు. ఆ దంపతులకు ముగ్గురు బిడ్డలు. ఇంకా పెళ్లి కాలేదు. ఇంతటి కష్టం వచ్చిన ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.