ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 11 డిశెంబరు 2020 (08:06 IST)

మాధవ్ బట్లర్ ఇంగ్లీషుకు పార్లమెంట్ సభ్యులంతా నవ్వుకుంటున్నారు: పిల్లి మాణిక్యరావు

రాష్ట్రంలో ఏప్రభుత్వ హయాంలో మానవహక్కులు కాపాడ బడ్డాయో, ఎవరిపాలనలోప్రజలు తమహక్కులను స్వేచ్ఛగా వినియోగించుకున్నారో, జాతీయ మానవహక్కుల దినోత్సవం సందర్భంగా వైసీపీఎంపీ గోరంట్ల మాధవ్ తెలుసుకుంటే మంచిదని టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు  సూచించారు.

ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబునాయుడిపై, పరిటాల రవీంద్ర, ఆయనకుటుంబంపై తప్పుడు ప్రచారం చేసిన మాధవ్ ఎప్పటిలానే అతని అలవాటు ప్రకారమే వ్యవహరించాడన్నారు.

మాధవ్ ఎంపీకాకముందు అతని పరిస్థితేమిటో అందరికీ తెలుసునని, పోలీస్ అధికారిగా ఉన్న సమయంలో ఏనాడూ ఆయన తన విధినిర్వహణను సక్రమంగా చేసిందిలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి తొడలుకొట్టినవారికి, తగలబెట్టినవారికి, సభ్యతలేకుండా ఎదుటివారిని తూలనాడేవారికి ఏరికోరి మరీ ఎంపీ పదవులిచ్చా డనటానికి మాధవ్ ప్రత్యక్షఉదాహరణ అని మాణిక్యరావు స్పష్టం చేశారు. 

వైసీపీతరుపున పార్లమెంట్ కు ఎన్నికైనవారిలో 80శాతం మంది నేరప్రవృతి కలిగినవారేనని సాక్షాత్తూ పార్లమెంట్ కమిటీయే చెప్పడం జరిగిందన్నారు. మాధవ్ ఎక్కడున్నా తన నేర స్వభావాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడన్నారు. ఆయనపై చిన్నారిని అత్యాచారం చేసినందుకు ఫోక్సో చట్టం కింద కేసు మోపబడిందని, రాష్ట్రవ్యాప్తంగా ఇంకా అనేక కేసులు మాధవ్ పై ఉన్నాయన్నారు.

అటువంటి వ్యక్తి చంద్రబాబునాయుడిగురించి, పరిటాలరవీంద్ర, ఆయన కుటుంబం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నా రు. మాధవ్ గురించి చెప్పాలంటే చాలానే ఉందన్న మాణిక్యరావు, 1983కి ముందు రాష్టప్రజల పరిస్థితి ఎలాఉందో, మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని ప్రజలు ఎలాంటి దీనస్థితిలో బతికారో ఇప్పటికీ ప్రజలెవరూ మర్చిపోలేదనే నిజాన్ని గోరంట్ల తెలుసుకోవాలన్నారు.

1983లో టీడీపీ అధికారంలోకి వచ్చాకే, నిజమైన టువంటి స్వేచ్ఛావిధానం రాష్ట్రంలో అమలైందని, ప్రజలంతా స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడం జరిగిందన్నారు.  రాయలసీమ ప్రాంతంలో పరిటాల నెత్తురు పారించాడంటున్న మాధవ్, టీడీపీ హాయాంలో రవీంద్ర అక్కడ నీళ్లుపారించాడనే నిజాన్ని తెలుసు కోలేకపోవడం సిగ్గుచేటన్నారు. 

చంద్రబాబు నాయుడు బీసీలకు అన్యాయం చేశాడని నేరచరితుడైన మాధవ్ చెప్పడం సిగ్గుచేటన్నా రు. నేరచరితులు, చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన వారి నోటివెంట మంచిమాటలు వస్తాయని ఆశించడం ప్రజల మూర్ఖత్వ మే అవుతుందన్నారు.  టీడీపీ అంటేనే బీసీలపార్టీ అని, ఎందరు బీసీలను రాష్ట్ర, దేశస్థాయి నాయకులను తయారుచేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు.

దేవేందర్ గౌడ్, కింజారపు ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, కాల్వ శ్రీనివాసులు, కింజారపు అచ్చెన్నాయుడు వంటివారు టీడీపీలో ఎలాంటి స్థానాల్లో ఉన్నారో మాధవ్ కి తెలియదా అని మాణిక్యరావు నిలదీ శారు.  బీసీల్లోని రౌడీలకు పదవులిచ్చిన వైసీపీప్రభుత్వం, వారి ప్రవర్తన చూసి సిగ్గుపడాల్సిన సమయం వచ్చిందన్నారు. టోల్ గేట్ దగ్గర వడ్డెరఫెడరేషన్ ఛైర్మన్ ఆడరౌడీలా టోల్ గేట్ సిబ్బందిపై దాడిచేసిందన్నారు.

ఫేక్ ముఖ్యమంత్రిని, విషపత్రికను అడ్డుపెట్టు కొని, మాధవ్ లాంటివారు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నా రు. వైసీపీపార్టీనే దొంగలపార్టీ అని, ఆ పార్టీ పేరుని కూడా వరంగల్ కు చెందిన శివకుమార్ అనేవ్యక్తినుంచి దొంగిలించారని మాణిక్యరావు మండి పడ్డారు. సొంతబాబాయిని నరికి చంపి, అధికారంలోకి వచ్చిన పార్టీ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు.

కోడికత్తులు, తాపీలతో రాజకీయాలు చేసే పార్టీ, ఆపార్టీకి చెందిననేతలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. గోరంట్ల మాధవ్ పార్లమెంట్ లో మాట్లాడే బట్లర్ ఇంగ్లీషు విని, తోటి సభ్యులంతా పకపక నవ్వుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయ న్నారు.  రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి గోదావరి జలాలను ఆప్రాంతానికి తరలించిన చరిత్ర టీడీపీదని మాణిక్యరావు స్పష్టంచేశారు.

సీమప్రాంతంలోని ఫ్యాక్షనిజాన్ని రూపుమాపి, అక్కడివారికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించిన ఘనత కూడా టీడీపీకే దక్కుతుందన్నారు. పులివెందుల నియోజకవర్గంలోనే ఒంటరి మహిళపై దాడిచేసి చంపేశారని, ముఖ్యమంత్రి సొంతస్థానంలో జరిగిన దారుణం మాధవ్ కు కనిపించడంలేదా అని టీడీపీనేత నిలదీశారు. క్రిమినల్ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇకనుంచైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని మాణిక్యరావు తీవ్రస్వరంతో హెచ్చరించారు.  
  
పనికిమాలిన మంత్రి కొడాలినానీకి ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోవడం లేదని, ఆయనేం మాట్లాడతాడో ఆయనకే తెలియదని, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా నానీకి మంత్రిపదవి దొరికిందని మాణిక్యరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబునాయుడు ఎప్పుడూ కూడా విచ్ఛిన్నం చేసే రాజకీయాలు  చేయలేదని, అటువంటి రాజకీయ చరిత్ర వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డిలకే ఉందనే నిజాన్ని నానీ తెలుసుకోవాలన్నారు.

ఏలూరు ఘటనకు బాధ్యులెవరో, స్థానికమున్సిపల్ కమిషనర్ తన విధులు తాను సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్ల, రసాయన వ్యర్థాలు తాగునీటి లో కలవడం వల్లే  వింతవ్యాధి ప్రబలితే, అంతపెద్ద సమస్యను వదిలేసి, నానీ పనికిమాలిన మాటలతో కాలక్షేపం చేస్తున్నా డన్నారు. విశాఖపట్నంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఘటనకు వైసీపీ ప్రభుత్వమే కారణమని, కోటిరూపాయల పరిహారం ముసుగులో కంపెనీనే కబ్జా చేయడానికి జగన్ సర్కారు సిద్ధమైందన్నారు. 

దేవాలయాలపై దాడులు, విగ్రహాల దొంగతనాలు, దళితులపై దాడులు, అత్యాచారాలు, శిరోముండనాలు చేయించిన ప్రభుత్వంలో ఉన్ననానీ, సిగ్గులేకుండా మంత్రిపదవికోసం పిచ్చిపిచ్చిగా వాగుతున్నాడని మాణిక్యరావు మండిపడ్డారు. తోకకాలిన కోతిలా కేకలేస్తున్న నానీ, తనమంత్రిపదవికోసమే ప్రతిపక్షనేతను, దూషిస్తున్నాడని ప్రజలకు ఇప్పటికే అర్థమైందన్నారు.

నానీ నోరు అదుపులో ఉండటం లేదని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రిగిరీని పీకడానికి సిద్ధమయ్యాడని,  దాంతో దిక్కుతోచనిస్థితిలో పడిన నానీ, తనడ్రైనేజీ నోటితో చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నాడన్నారు. నానీ నోటిలో ఉండాల్సిన మలినాలు, మురుగు, నానావ్యర్థాలు ఉన్నాయన్నారు.

గతంలో దేవినేనిఉమాపై లారీ ఎక్కిస్తాను అన్న కొడాలినానీ, నేడు చంద్రబాబుకి బడితపూజచేస్తానంటూ మాట్లాడాడని,  అతని వ్యాఖ్యలను న్యాయస్థానాలు సుమోటాగా పరిగణనలోకి తీసుకొని  సదరు నానీపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు మాణిక్యరావు తెలిపారు. రాష్ట్రానికి మంత్రిగా ఉన్నవ్యక్తిపై కోర్టులు తగినవిధంగా చర్యలుతీసుకోవాలని, అతన్ని మంత్రివర్గంనుంచి తొలగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తిచేస్తున్నామన్నారు.