శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 21 సెప్టెంబరు 2020 (13:16 IST)

8 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్‌

రాజ్యసభలో ఘర్షణపూరితమైన వాతావరణాన్ని కల్పించి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులు సస్పెండ్ అయ్యారు.

సస్పెండ్‌ అయిన వాళ్లలో డెరెక్‌ ఓ బ్రైన్‌, సంజరు సింగ్‌, రాజు సతవ్‌, కెకె రగేష్‌, రిపున్‌ బోరా, డోలా సేన్‌, సయ్యద్‌ నజీర్‌ హుస్సేన్‌, ఎలమరన్‌ కరీం ఉన్నారు. వీరిలో ముగ్గురు కాంగ్రెస్‌ సభ్యులు కాగా, సీపీఐ(ఎం) నుంచి ఇద్దరు, ఏఐటీసీ నుంచి ఇద్దరు, ఒకరు ఆప్‌ సభ్యులు.

ఆదివారం వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు డిప్యూటీ చైర్మన్‌ స్థానం వద్దకు వెళ్లి రైతు వ్యతిరేక ప్రభుత్వమంటూ నినాదాలు చేశారు. టీఎంసీ సభ్యుడు డెరెక్‌ ఓబ్రీన్‌ డిప్యూటీ చైర్మన్‌ స్థానం వద్దకు దూసుకువెళ్లారు. వ్యవసాయ బిల్లుల చర్చ, ఓటింగ్‌ సమయంలో ఆదివారం రాజ్యసభలో చోటుచేసుకున్న గందరగోళ పరిస్థితులపై రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.  సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

ఎనిమిది మంది ప్రతిపక్ష సభ్యుల్ని వారం రోజులపాటు సస్పెండ్‌ చేశారు. కాగా ఆదివారం ప్రతిపక్ష ఎంపీల ప్రవర్తనను అధికారపక్షం సీరియస్‌గా తీసుకుంది. రూల్‌ 256 ప్రకారం సభ్యుల సస్పెన్షన్‌ కోరుతూ ఈ ఉదయం గం. 9.05 కు రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చైర్మన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.