మంగళవారం, 15 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 4 జూన్ 2016 (10:06 IST)

అమరావతికి ఒక్క పైసా ఇవ్వలేం : తేల్చి చెప్పి కేంద్ర ప్రభుత్వం

అసలే నిధుల కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం తేరుకోలేని షాకిచ్చింది. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ఇకపై ఒక్క పైసా కూడా విడుదల చేయలేమని స్పష్టంచేసింది. ఇప్పటిదాకా కేటాయించి

అసలే నిధుల కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం తేరుకోలేని షాకిచ్చింది. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ఇకపై ఒక్క పైసా కూడా విడుదల చేయలేమని స్పష్టంచేసింది. ఇప్పటిదాకా కేటాయించిన రూ.2,050 కోట్లతోనే సరిపెట్టుకోవాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఇటీవలే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ విషయం చెప్పినట్టు సమాచారం పైగా ఇదే అంశంపై రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారుల ముందు కేంద్రం వితండ వాదన చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ భేటీలో విభజన చట్టంలోని 94(3) సెక్షన్ ను బయటకు తీసిన కేంద్రం... సదరు సెక్షన్ ప్రకారం రాజ్ భవన్, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి భవనాలను మాత్రమే తాము నిర్మించాల్సి ఉందని చెప్పింది. ఈ భవనాలన్నింటినీ రూ.2,050 కోట్లతోనే నిర్మించుకోవచ్చని వాదించింది. ఇది సాధ్యం కాదని ఏపీ భావిస్తే... ఆ నిధులను వెనక్కిస్తే తామే వాటిని నిర్మించి ఇస్తామని కూడా కేంద్రం చెప్పడంతో రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారుల నోట మాట రాలేదట.