శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 మార్చి 2022 (08:30 IST)

రాజధాని అమరావతి ఉద్యమానికి తాత్కాలిక విరామం?

నవ్యాంధ్ర రాజధాని కోసం అమరావతి రైతులు నిర్వహిస్తూ వచ్చిన ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతేనంటూ ఇటీవల ఆంధ్రప్రదశ్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమైన హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దీంతో రాజధాని ప్రాంత రైతులు వందల రోజులుగా కొనసాగిస్తూ వచ్చిన ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించాలన్న ఆలోచనలో జేఏసీ నేతలు ఉన్నారు. 
 
ఇదే అంశంపై చర్చించేందుకు ఇటీవల సమావేశమైన జేఏసీ నేతలు... ఏపీ రాజధాని అమరావతే అని కోర్టు తేల్చి చెప్పినందున ఉద్యమానికి తాత్కాలికంగా కొంత విరామం ప్రకటించాలని కొందరు నేతలు అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయితే, ప్రధాన ఉద్యమ శిబిరాలు మాత్రం కొనసాగించాలని మరికొందరు చెప్పారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల వరకు కొనసాగించి ఆ తర్వాత తాత్కాలిక విరామం ప్రకటిద్దామని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. 
 
అమరావతే ఎలగూ రాజధాని అని కోర్టు చెప్పింది కాబట్టి అభివృద్ధి పనులు ప్రారంభించాలని ఉద్యమం చేపడుదామని రైతులు న్యాయకు పేర్కొన్నారు. అయితే, సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల వరకు శిబిరాలు కొనసాగించి ఆ తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకుని తదుపరి కార్యాచరణ రూపొందించాలని సమావేశంలో రాజధాని ఉద్యమ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు నిర్ణయం తీసుకున్నారు.