మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 ఫిబ్రవరి 2022 (11:41 IST)

అమరావతిలో రైతుల ఉద్యమానికి సరిగ్గా 800 రోజులు

అమరావతిలో రైతుల ఉద్యమం ప్రారంభించి నేటితో సరిగ్గా 800 రోజులు గడిచాయి. అమరావతినే రాజధానిగా ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ ఉద్యమం 800వ రోజుకు చేరిన సందర్భంగా రాజధాని రైతులు అమరావతి ప్రజాదీక్ష పేరుతో దీక్ష చేపట్టారు. వెలగపూడిలో 24 గంటల పాటు రైతుల సామూహిక నిరాహార దీక్ష నిర్వహిస్తామన్నారు. 
 
ఉదయం 9 గంటల నుంచి 24 గంటల పాటు దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా మార్చిలో ఉత్తరాంధ్ర నుంచి జేఏసీల ఏర్పాటు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని రాజధాని రైతులు వెల్లడించారు. 
 
ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని పక్కన పెట్టడం.. పైగా మూడు రాజధానుల పేరుతో కొత్త ప్రతిపాదనలు తీసుకురావడంతో అమరావతి రైతులు రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. తమకు జరిగిన అన్యాయంపై నిరంతర పోరాటం సాగిస్తున్నారు.