1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (11:07 IST)

అమరావతి రాజధాని కోసం రైతుల మహా పాదయాత్ర

అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన ‘న్యాయస్థానం టూ దేవస్థానం’ మహా పాదయాత్రకు పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లులో రైతుల పాదయాత్రపై అమరావతి జేఏసీ నేతల దగ్గరకు అడిషనల్ ఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో నలుగురు డీఎస్పీలు వెళ్లారు. నిబంధనలకు అనుగుణంగా పాదయాత్ర కొనసాగించాలని ఆదేశాలు జారీచేశారు. మహా పాదయాత్రపై మొత్తం మూడు కేసులు నమోదు చేశారు జిల్లా పోలీసులు.
 
ఇప్పటికే మాహాపాదయాత్రపై జిల్లా పోలీసులు మూడు కేసులు నమోదు చేయగా.. మహా పాదయాత్ర సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు పోలీసులు. పాదయాత్ర సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసులు వెల్లడించారు. అయితే నిబంధనలకు అనుగుణంగానే పాదయాత్ర నిర్వహిస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.
 
అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 8వ రోజుకు చేరుకుంది. ప్రకాశం జిల్లా ఇంకొల్లు నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. తొమ్మిదవ రోజు ఇంకొల్లు నుంచి దుద్దుకూరు వరకు యాత్ర సాగనుంది. పర్చూరు నియోజకవర్గంలో పాదయాత్ర సాగుతుంది. పాదయాత్రకు కొన్ని రాజకీయ పార్టీల సంఘీభావం ప్రకటించాయి.