గురువారం, 20 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (18:58 IST)

ఆంధ్రాలో కూడా ఓ మొగోడున్నాడ్రా... అదే పవన్ కల్యాణ్: ఉండవల్లి అరుణ్ కుమార్

undavalli arun kumar
ఆంధ్రాలో కూడా ఓ మొగోడున్నాడ్రా... అదే పవన్ కల్యాణ్ అంటూ చెప్పారు సీనియర్ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్. ఏపీ విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడంలో జగన్, చంద్రబాబు వల్ల కాలేదన్నారు. ఇప్పుడు కాస్తో కూస్తో తనకు పవన్ కల్యాణ్ పైన నమ్మకం వుందని చెప్పుకొచ్చారు. విభజన హామీలను కేంద్రం మెడలు వంచి తీసుకురాగల సత్తా పవన్ కల్యాణ్ కి వుందని నమ్ముతున్నట్లు చెప్పారు.
 
ఇప్పటికే ఏపీకి ఆనాడు కేంద్రం ఇచ్చిన హామీలన్నీ ఓ లేఖ ద్వారా పవన్ కల్యాణ్ గారికి పంపడం జరిగిందన్నారు. ఆయన బిజీ సమయంలో అవన్నీ చూస్తారో లేదో తనకు తెలియదనీ, ఐతే మరో రెండ్రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలపై చర్చించి వాటిని రాబట్టేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నించాలని కోరుతున్నట్లు చెప్పారు.