శుక్రవారం, 5 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 28 జులై 2021 (03:11 IST)

అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్: కేంద్రం

అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ మారిందిని పార్లమెంట్‌లో కేంద్రం స్పష్టం చేసింది. ఆదాయానికి మించి అప్పులు చేయడంలో ఏపీ అగ్రభాగాన ఉందని కేంద్రం పేర్కొంది.

రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

ఈ సందర్భంగా పార్లమెంటు సాక్షిగా ఏపీకి కేంద్ర ఆర్థికశాఖ అక్షింతలు వేసింది. 2020-21 సంవత్సరానికి రు.54,369.18 కోట్ల ఆర్థిక లోటు ఉందని రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకుందని కేంద్రం తెలియజేసింది.
 
15వ ఆర్ధిక సంఘం అనుమతి మేరకు 2020-21 ఆర్ధిక సంవత్సరానికి రూ. 30,305 కోట్ల అప్పునకు అనుమతి కోరిందని కేంద్రం పేర్కొంది.

కొవిడ్‌ కారణంగా మరో రూ.19,192 కోట్ల అప్పునకు అనుమతిచ్చినట్లు కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 49,497 కోట్ల అప్పులు తెచ్చుకునేందుకు అనుమతులు ఇచ్చామని పేర్కొంది. పరిమితికి మించి ఏపీ రూ.4,872 కోట్ల అప్పు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.