శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 9 జులై 2021 (10:06 IST)

రానున్న 14 రోజులు ఆంధ్రప్రదేశ్‌లో జోరువానలు

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న 14 రోజులు  జోరువానలు కురుస్తాయని అమరావతి వాతారణ కేంద్రం తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా మాట్లాడుతూ... ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంను ఆనుకుని ఉన్న వాయవ్య ప్రాంతంలో ఈ నెల 11 న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.

రుతుపవనాల కదలికతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయన్నారు. శుక్రవారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు తీరప్రాంతం, రాయలసీమలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. నైరుతి రుతుపవనాల మందగమనంతో గత నెల చివర్లో వర్షాలు తగ్గినప్పటికీ మళ్లీ వర్షాలు జోరందుకుంటున్నాయన్నారు.

నేటి నుండి ఉత్తరాంధ్ర, యానాం, రాయలసీమలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురవొచ్చని, ఈనెల 10 న కోస్తా తీరంలో గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చునని స్టెల్లా వివరించారు.