శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 10 జూన్ 2021 (20:14 IST)

ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ వాయవ్య దిశగా ఒడిశావైపు అల్పపీడనం కదులుతోందని తెలిపింది.

ఈ అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రెండు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు.. దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కురిసే అవకాశం ఉందని పేర్కోంది.

ప్రస్తుతం అల్పపీడనం ప్రభావంతో విశాఖపట్టణం తీరం వెంబడి గంటకు 45-60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని, దీంతో సముద్రంలో చేపల వేటకు మత్య్సకారులు ఎవరూ వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.