కాంట్రాక్టు ఉద్యోగులపై సీఎం జగన్ 'రివర్స్' అస్త్రం

jagan
ఠాగూర్| Last Updated: గురువారం, 13 ఫిబ్రవరి 2020 (15:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న రివర్స్ టెండరింగ్ విధానం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా, పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు, పీపీఏల రద్దు వంటి అంశాలపై ఆయన రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. తద్వారా ప్రభుత్వానికి రూ.కోట్ల మేరకు ఆదా అయినట్టు వైకాపా సర్కారు చెప్పుకుంటూ వచ్చింది.

ఈ క్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులపై కూడా జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ అస్త్రాన్ని ప్రయోగించారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపులోనూ రివర్స్ వెళ్తోంది. మహిళ, శిశుసంక్షేమ శాఖ కాంట్రాక్టు ఉద్యోగులపై రివర్స్‌ అస్త్రం విసిరింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 3 వేల నుంచి 7 వేల రూపాయల వరకు జీతాలు పెరిగిన విషయం విదితమే.

అయితే ఇప్పటివరకు అందుకున్న పెరిగిన జీతం మొత్తం తిరిగి చెల్లించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వం నిర్ణయంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అంత మొత్తం ఎక్కడి నుంచి తేవాలంటూ ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.దీనిపై మరింత చదవండి :