శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 జూన్ 2021 (13:05 IST)

ప్రేమించాను.. ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటానన్న యువతి.. పెట్రోల్ పోసి..?

ప్రేమించానని ఓ యువతి చెప్పడం.. ప్రేమించిన వ్యక్తినే వివాహం చేసుకుంటానని తెలపడం.. ఆ యువతి ప్రాణం తీసింది. ఓ యువకుడిని ప్రేమించానని అతన్నే పెండ్లి చేసుకుంటానని చెప్పిన ఆ యువతి పై ఆమె కుటుంబసభ్యులే పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన ఘటన ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా రాయచోటిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. రాయచోటి యువతికి పెండ్లి చేసేందుకు ఆమె తల్లిదండ్రులు కొంతకాలంగా సంబంధాలు చూస్తున్నారు. అందుకు ఆ యువతి ఒప్పుకోలేదు. మంగళవారం మరోసారి పెండ్లి విషయమై కుటుంబ సభ్యులంతా ఆమెను బలవంతపెట్టారు. 
 
నిరాకరించిన ఆ యువతి తాను ప్రేమించిన యువకుడినే పెండ్లి చేసుకుంటానని చెప్పింది. దాంతో ఆమె తల్లి, తండ్రి, సోదరుడు యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. యువతి కేకలు వేయడంతో ఆమె సోదరి, ఇరుగుపొరుగువారు వచ్చి మంటలను ఆర్పారు. గాయపడిన యువతిని కడప రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.