ఆదివారం, 3 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 మే 2024 (08:27 IST)

జూన్ 3న ఏపీ మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామన్న జీఏడీ!!

ap assembly
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఈ నెల 13వ తేదీన ఏపీ అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరిగింది. జూన్ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇంతలోనే ఏపీలో సమీకరణాలు మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి నుంచి విశాఖకు సామాగ్రి తరలిస్తుండగా, వాటిని సీఆర్డీఏ అధికారులు అడ్డుకున్నారు. పైగా, జూన్ 3వ తేదీన మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని ప్రకటించారు. 
 
అమరావతి నుంచి విశాఖకు సామాగ్రి తరలిపోతున్నట్టు కథనాలు వస్తున్న నేపథ్యంలో సీఆర్డీయే అధికారులు రంగంలోకి దిగారు. ఎన్ అండ్ టి గోదాము నుంచి నిర్మాణ సామాగ్రి తరలింపును సీఆర్డీఏ అధికారులు అడ్డుకున్నారు. తమ అనుమతి లేకుండా సామాగ్రి తరలించచవద్దని స్పష్టం చేశారు. 
 
అటు జూన్ 3వ తేదీన సచివాలయంలో మంత్రుల చాంబర్లు స్వాధీనానికి జేఏడీ (సాధారణ పరిపాలన శాఖ) ఆదేశాలు జారీచేసింది. సచివాలయం నుంచి ఎలాంటి సామాగ్రి బయటికి తీసుకెళ్లవద్దని స్పష్టం చేసింది. తన అనుమతి లేకుండా పత్రాలు, వస్తువులు తీసుకెళ్లవద్దని పేర్కొంది. 
 
మంత్రులు పేషీలు, ప్రభుత్వ శాఖల్లోని ఫైళ్లు తరలించేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. సచివాలయం నుంచి వెళ్లే వాహనాలు తనిఖీలు చేయాలని ఎస్పఎఫ్ సిబ్బందిని ఆదేశించింది. జూన్ మూడో తేదీన మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని స్పష్టం చేసింది.