శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 24 జులై 2023 (14:16 IST)

టీడీపీ నేత కన్నాకు షాకిచ్చిన వైకాపా సర్కారు

kanna
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణకు వైకాపా ప్రభుత్వం తేరుకోలేని షాకిచ్చింది. ఆయనకు ప్రభుత్వం కల్పిస్తూ వచ్చిన సెక్యూరిటీని తొలగించింది. కన్నా లక్ష్మీనారాయణ గన్‌మెన్లను ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని టీడీపీ ఆరోపిస్తోంది. భద్రత తొలగింపు విషయంలో ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 
 
గన్‌మెన్లను తొలగించడం సరికాదని టీడీపీ అంటుంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఒత్తిడితోనే గన్‌మెన్లను ఉపసంహరించుకుందని ఆరోపిస్తుంది. ఇకపోతే కన్నా లక్ష్మీనారాయణ గన్‌మెన్లుగా ఉన్న పోలీసులు గత మూడు రోజులుగా విధులకు రావడం లేదు. దీంతో అనుమానం వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ ఆరాతీయగా భద్రత ఉపసంహరించుకున్నట్లు తెలిసిందని పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి కన్నా లక్ష్మీనారాయణ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.